జాతీయ జెండాకు ఘోర అవమానం

by Jakkula Mamatha |
జాతీయ జెండాకు ఘోర అవమానం
X

దిశ,వెబ్‌డెస్క్: గణతంత్య్ర దినోత్సవ(Republic Day) వేడుకల్లో జాతీయ జెండా(National Flag)కు అవమానం జరిగింది. దేశమంతటా 76వ గణతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా(Kadapa District)లో సంచలన ఘటన చోటుచేసుకుంది. గణతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో జాతీయ జెండాకు అవమానం జరిగింది. ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ బ్యాంక్(Co-operative Bank) సిబ్బంది సరిగ్గా ఎగురవేయక పోవడంతో స్తంభం మధ్యలో జెండా వేలాడుతూ కనిపించింది. జాతీయ జెండాకు అవమానం జరిగేలా నిర్లక్ష్యంగా ఉండడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాన్ని అవమానించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Next Story