- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాలయ్య ఇలాకలో వైసీపీకి భారీ షాక్.. కీలక నేత రాజీనామా

దిశ, వెబ్ డెస్క్: బాలయ్య ఇలాకలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో హిందూపురం వైసీపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయనను ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు హిందూపురం ఇంచార్జి బాధ్యతలను ఇక్బాల్‌కు సీఎం జగన్ అప్పగించారు. అయితే అప్పటి నుంచి కూడా హిందూపురంలో వైసీపీ కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఇక్బాల్‌కు బదులుగా హిందూపురం వైసీపీ అభ్యర్థిగా దీపికను ఖరారు చేశారు. దీంతో ఇక్బాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఇన్నాళ్లు తాను ఎంతో కృషి చేశానని.. కానీ సీఎం జగన్ తనకు కాకుండా దీపిక సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న ఆయన తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తదుపరి కార్యచరణపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఇక్బాల్ పేర్కొన్నారు.
Read More..