- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైసీపీకి మరో బిగ్ షాక్.. కుమారుడితో కలిసి మాజీ మంత్రి రాజీనామా
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా శింగనమలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి శమంతకమణి రాజీనామా చేశారు. ఆమె కుమారుడు సైతం గుడ్ బై చెప్పారు. ఆదివారం ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే యామిని బాల రాజీనామా చేశారు. 24 గంటలు కూడా గడవకముందే మాజీ మంత్రి శమంతకమణి, ఆమె కుమారుడు అశోక్ వైసీపీకి షాక్ ఇచ్చారు. శింగనమల టికెట్‌ను శమంతకమణి ఆశించారు. కానీ ఇతరులకు సీటు ఖరారు కావడంతో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. కనీసం తన కుమారుడికైనా సీటు ఇవ్వాలని అధిష్టానాన్ని అడిగారట. అయితే అక్కడ నుంచి స్పష్టత రాకపోవడంతో వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీని వీడుతున్నట్లు సోమవారం ప్రకటించారు.
కాగా శమంతకమణి కుమార్తెనే యామిని బాల. ఆదివారం యామిని బాల రాజీనామా చేయగా.. ఇవాళ తల్లి శమంతకమణి, సోదరుడు అశోక్ గుడ్ బై చెప్పారు. టీడీపీలో మంత్రిగా పని చేసిన శమంతకమణి.. 2019 నుంచి వైసీపీలో కొనసాగారు. శింగనమల సీటు ఆశించి భంగ పడ్డారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ పంపారు. వీరి రాజీనామాలతో జగన్ పార్టీకి శింగనమల నియోజకవర్గంలో వరుస దెబ్బలు తగులుతున్నాయి.