- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్.. రంగంలోకి సీఐడీ
దిశ, వెబ్ డెస్క్: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రతిపక్షలు చేస్తున్న ఆరోపణలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నారంటూ ఫైర్ అయింది. ఆ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో చర్యలు తీసుకోవాలని సీఐడీ డీజీకి ఎన్నికల సంఘం ఆదేశించింది. వైసీపీ ఫిర్యాదు చేసిన కాపీని సీఐడీ అడిషనల్ డీజీకి పంపింది.
ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై అటు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల స్పందించారు. కబ్జాలకు చెక్ పెట్టేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినట్లు తెలిపారు. టీడీపీ హయాంలో ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందన్నారు. సీఆర్డీఏలో డీమ్డ్ అని పెట్టి అసైన్డ్ భూములను కాజేశారని పేర్కొన్నారు. సాదా బైనామా పేరిట పేపర్ తయారు చేసి భూములను రాయించుకున్నారని తెలిపారు. ఇప్పటికే భూ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని భూములపై సమగ్ర సర్వే చేయాలన్నారు. ఈ యాక్ట్ రూపకల్పన దశలో ఉందని, అమలుకు మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.