అవినాశ్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటున్నా.. దేనికైనా సిద్ధమే.. దస్తగిరి సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-02-23 16:47:01.0  )
అవినాశ్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటున్నా.. దేనికైనా సిద్ధమే.. దస్తగిరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్‌‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని తనను ప్రలోభపెట్టారని చెప్పారు. దాడి కేసులో బెయిల్ మంజూరు కావడంతో కడప జిల్లా జైలు నుంచి దస్తగిరి విడుదల అయ్యారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ తాను జైలులో ఉన్న సమయంలో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలుకు వచ్చి కలిశారని తెలిపారు. తమకు అనుకూలంగా మారాలని తనను అడిగినట్లు దస్తగిరి తెలిపారు. చావుకైనా సిద్ధమేకాని.. అప్రూవర్ నుంచి మాత్రం వెనక్కి తగ్గనని దస్తగిరి చెప్పారు.

వివేకా హత్యలో తప్పు చేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్‌గా మారానని దస్తగిరి పేర్కొన్నారు. మళ్లీ తప్పు చేయాలని జగన్, అవినాశ్ తనను ప్రలోభ పెడుతున్నారన్నారు. పులివెందులోనే ఉంటానని, ఎవరు వస్తారో చూస్తానని దస్తగిరి హెచ్చరించారు. అవినాశ్ రెడ్డి ఇంటిపక్కనే ఉంటున్నానని, తాను దేనికైనా సిద్ధమేనని దస్తగిరి తెలిపారు. చావుకైనా సిద్ధమే కానీ వైసీపీ నేతలకు లొంగే ప్రసక్తే లేదన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ వివేకానందారెడ్డి హత్యను అడ్డంపెట్టుకుని సానుభూతితో సీఎం జగన్ మోహన్ రెడ్డి గెలుపొందారని తెలిపారు. అదే కుట్రతో మరోసారి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని దస్తగిరి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed