ఎన్నికల వేళ అరుదైన ఘనత సాధించిన వైఎస్ సునీత..?

by Jakkula Mamatha |   ( Updated:2024-05-12 15:00:58.0  )
ఎన్నికల వేళ అరుదైన ఘనత సాధించిన వైఎస్ సునీత..?
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఇక ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు హీటెక్కాయి. ప్రధాన పార్టీలు ఎన్నికల్లో భాగంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అన్నాచెల్లెళ్ల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కడపలో వైఎస్ షర్మిల అవినాష్ రెడ్డి పై పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల, సునీత న్యాయమే గెలుస్తుందంటూ సీఎం జగన్‌కు సవాల్ విసురుతున్నారు. ఎన్నికల వేళ వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతకు అరుదైన గౌరవం దక్కింది.

వివరాల్లోకి వెళితే..అపోలో హాస్పిటల్ డాక్టర్ సునీత నర్రెడ్డి ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా(IDSA) ఫెలోగా ఎంపికయ్యారు. ఇది అంటు వ్యాధుల రంగంలో విశేషమైన కృషికి, అంకితభావానికి నిదర్శనమని IDSA పేర్కొంది. ఈ సందర్భంగా ఆమె సేవలకు అభినందిస్తున్నామని IDSA స్టీవెన్ కే.స్మిత్ వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించినందుకు డాక్టర్ సునీతని అపోలో హాస్పిటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి, పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ గుర్తింపు దక్కడంపై వైఎస్ సునీత హర్షం వ్యక్తం చేశారు.

Read More..

Breaking: పల్నాడు జిల్లా రెంటచింతలలో ఉద్రిక్తత

Advertisement

Next Story

Most Viewed