- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: అసలు జగన్ రాజశేఖర్ రెడ్డి కొడుకేనా..? వైఎస్ షర్మిల ఫైర్
దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అన్నచెల్లెల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. తోడబుట్టిన అన్నమీదే వైఎస్ షర్మిల తిరగబడింది. రక్తం పంచుకుపుట్టిన చెల్లికి అండగా ఉండాల్సిన అన్న.. తన ఇంటి ఆడపడుచు అయిన వైఎస్ షర్మిల పై ట్రోల్ల్స్ చేయిస్తూ మానసికంగా ఆమెను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో వైఎస్ షర్మిలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోంది.
తాజాగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రస్తావించిన వైఎస్ షర్మిల తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులు ఎలా జీవించారు.. ఇప్పుడెలా బతుకుతున్నారో ఆలోచించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. గడిచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. చంద్రబాబు నాయడు రాజధాని కట్టారా అని ప్రశించారు.
అలానే జగన్ మూడు రాజధానులు అన్నారు ఒక్క రాజధాని అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. ఈరోజు ఆంధ్రా ప్రజలు తలెత్తుకుని ఇది మా రాజధాని అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నారంటే అది సిగ్గు చేటు కాదా అని మండిపడ్డారు. ఇక బీజేపీ ఆంధ్రప్రదేశ్ కి ఏం చేసిందని చంద్రబాబు, జగన్ బీజేపీతో పొత్తుకోసం పాకులాడుతున్నారని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను అని చెప్పిన బీజేపీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చెయ్యలేదు. కనీసం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసినా..
బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటే అర్ధం ఉందని.. కానీ ఏపీ చెయ్యని బీజేపీతో ఎందుకు పొత్తు కోరుకుంటున్నారని ప్రశ్నించారు. అలానే బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉంద్యోగాలు ఇస్తామని చెప్పిందని.. ఆ లెక్కన చూసుకుంటే పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలని పేర్కొన్నారు. ఇక మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక కోటి లేదా కనీసం పది లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉన్న ఈ రోజు పొత్తు పెట్టుకున్నారంటే అర్థముందని.. అది కూడా బీజేపీ చెయ్యనప్పుడు పొత్తు ఎందుకు అని మండిపడ్డారు.
ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు, అసలు ఏ ఒక్క వాగ్దానం నిలబెట్టుకొని బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పి తరవాత చంద్రబాబు ఓట్లు అడగాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే రాజశేఖర్ రెడ్డి తన జీవితకాలంలో ఎప్పుడూ బీజీపీని సమర్ధించలేదాని.. ఎప్పుడూ బీజేపీని వ్యతిరేకిస్తూనే వచ్చారని వెల్లడించారు.
బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని మండిపడ్డారు. మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలికాచుకోవడం ఇదే కదా బీజేపీ పార్టీకి తెలిసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతాన్ని అవమానించి మరో మతాన్ని రెచ్చగొట్టే ధోరణితో బీజేపీ ఉంది కనుకే రాజశేఖర్ రెడ్డి బీజేపీని వ్యతిరేకించారు. మరి ఆయన కొడుకైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ బీజేపీతో ఎలా పొత్తు కోరుకుంటున్నారని ప్రశ్నించారు.