- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల
దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశం అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఆదాని నరేంద్ర మోదీకి బినామీ అన్నారు. సెబీని గుప్పిట్లో పెట్టుకొని స్వయంగా మోదీ ముందుండి అదానిని రక్షిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంలో మోదీని దేశ వ్యాప్తంగా ఎండగడతాం అన్నారు. అవినీతి రహిత పాలన అని మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవానికి దేశం మొత్తాన్ని అవినీతిలోకి నెట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం దేశం మీద సాగిస్తున్న నీచమైన పాలనను పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ ఎండగట్టారన్నారు. బీజేపీ నేతలు రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని విమర్శించిన షర్మిల.. వక్ఫ్ బోర్డు నిర్ణయంలో బీజేపీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, మైనార్టీల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో బీజేపీ అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యాచరణ చేస్తామని వైఎస్ షర్మిల అన్నారు.