ఓటమిపై వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్

by srinivas |
ఓటమిపై వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందింది. 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే 11 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. అటు చెల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా ఫలితం లేకుండా పోయింది. కూటమి గాలికి కాంగ్రెస్ పార్టీ కూడా కొట్టుకుపోయింది. కడప ఎంపీ స్థానంపై ఆశపెట్టుకున్న ఆమెకు అక్కడి ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. దీంతో అన్న జగన్, తన ఓటమిపై ఆమె స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తామంటూ ట్వీట్ చేశారు.

ఇప్పుడు ఓడిపోయినా భవిష్యత్తులో బలమైన పార్టీగా ఎదుగుతామని చెప్పారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న చంద్రబాబుకు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విభజన హామీలకోసం నిరంతరం ప్రయత్నం చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం వంటి హామీలను కచ్చితంగా సాధించాలన్నారు. రాజధాని నిర్మాణం చేపట్టడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు కృషి చేయాలని సూచించారు. విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి మద్దతు తెలపాలని వ్యాఖ్యానించారు. విభజనపై హామీలు నెరవేర్చకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా కొనసాగించాలని సూచించారు. జనం గొంతుక మారి నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

Advertisement

Next Story