- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Jagan:రాష్ట్రంలో దూసుకెళ్లనున్న వైసీపీ.. పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ కీలక సూచనలు!
దిశ,వెబ్‌డెస్క్: పార్టీ బాగుంటేనే అందరూ బాగుంటారని వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్(YS Jagan) అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ పార్టీ అనుబంధ సంఘాలతో వైఎస్ జగన్ నేడు(బుధవారం) సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల పై చర్చించి అనుబంధ సంఘాల నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక నుంచి రాష్ట్రంలో దూసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పార్టీ మనందరిదీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్.. ‘నేను మీ ప్రతినిధిని మాత్రమే. కష్టపడి పనిచేసి, నష్టపోయిన వారికి అండగా ఉంటాం. దేశంలో అత్యంత బలమైన పార్టీగా వైసీపీని తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పార్టీ పిలుపునిస్తే పై స్థాయి నుంచి కింది వరకు అంతా కదలి రావాలి. ప్రజల తరఫున పోరాటాల్లో చురుగ్గా ఉండాలి’ అని సూచించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని వారిని కోరారు. వైసీపీ అనుబంధ నూతన సంఘాలు వాటి జిల్లా అధ్యక్షులను ఇటీవల వైసీపీ అధినేత నియమించారు.