వలంటీర్లకు వైఎస్ జగన్ బర్త్ డే కానుక..జనవరి నుంచి అమలు

by Seetharam |
వలంటీర్లకు వైఎస్ జగన్ బర్త్ డే కానుక..జనవరి నుంచి అమలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని వలంటీర్లకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వాలంటీర్ల గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాలుగున్నరేళ్లుగా నెలకు రూ.5వేల జీతంతో వలంటీర్లు పనిచేస్తున్నారు. అయితే వలంటీర్లకు పనిభారం అధికమవుతున్న నేపథ్యంలో ఈ జీతాన్ని కొద్దిగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. జనవరి నుంచి అదనంగా రూ.750 పెంచాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 లక్షల మంది వలంటీర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లబ్ధి చేకూర నుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా వలంటీర్లకు కానుకగా గౌరవ వేతం పెంచుతున్నామని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed