- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేపు శ్రీకాకుళం జిల్లాకు సీఎం వైఎస్ జగన్
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 14న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం, అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను సీఎంవో వెల్లడించింది. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కంచిలి మండలం మకరాంపురం చేరుకుంటారు. అక్కడ డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార ఉద్దానం మంచినీటి ప్రాజెక్టును ప్రారంభిస్తారు. అనంతరం పలాస చేరుకుని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని సీఓంవో ఓ ప్రకటనలో తెలిపింది. బహిరంగ సభ ముగిసిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.