- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS Jagan: ఎన్టీఆర్‌కు మించి చంద్రబాబు నటిస్తున్నారు.. వైస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో రూ.10 లక్షల కోట్ల మేర అప్పులు చేశారంటూ అప్పట్లో చంద్రబాబు (Chandrababu) తమపై విష ప్రచారం చేశారని వైస్ జగన్ (YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగంలోనూ అబద్ధాలు చెప్పించారని ఫైర్ అయ్యారు. దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్ (NTR)కి మించి చంద్రబాబు నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన పేరును చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ (Super Six) పథకాలను ఎగ్గొట్టేందుకే తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని ఆక్షేపించారు.
2019లో టీడీపీ ప్రభుత్వం (TDP Government) నుంచి వైదొలిగే నాటికి రూ.3.13 లక్షల కోట్ల అప్పు ఉందని అన్నారు. అయితే, 2024లో తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్ల అప్పు ఉందని గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు (Chandrababu) రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని ప్రచారం చేశారని మండిపడ్డారు. తీరా నేడు బడ్జెట్‌లో చూస్తే రూ.6 లక్షల కోట్లే చూపించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు (Chandrababu) హయాంలో అప్పులు 19 శాతం పెరిగితే.. తమ హయాంలో 15 శాతం మాత్రమే అప్పులు పెరిగాయని తెలిపారు. ఇప్పటికైనా విషయాన్ని గ్రహించి ఆర్ధిక క్రమశిక్షణ పాటించినందుకు చంద్రబాబు తమకు అవార్డ్ ఇవ్వాలని జగన్ అన్నారు.