తాలిబన్ల పాలన కంటే వైసీపీ పాలన దారుణం.. నారా లోకేశ్ ఫైర్

by Nagaya |   ( Updated:2023-05-05 10:09:37.0  )
తాలిబన్ల పాలన కంటే వైసీపీ పాలన దారుణం.. నారా లోకేశ్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలన తాలిబన్ల కంటే దారుణంగా ఉందని విమర్శించారు. కర్నూలు జిల్లా మార్కాపురంలో లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా గ్రామస్థులు, ప్రజలు లోకేశ్ వద్దకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైకో పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారారని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తమకు చాలా ఇబ్బందులు పెడుతున్నారని.. ఉమ్మడి కుటుంబాలు ఉన్న ఇళ్లకు ఒక కుళాయి మాత్రమే ఇస్తున్నారని.. ప్రశ్నించిన వారిపై అడ్డగోలుగా హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారని లోకేశ్‌ ఎదుట బాధితులు వాపోయారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలు, పురుగుల మందులతో తాము నష్టపోయామని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తప్పుడు కేసులపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులను పక్కన పెడతామని హెచ్చరించారు. వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధి పూర్తిగా కనుమరుగైపోయిందని విమర్శించారు. రూ.8600 కోట్ల పంచాయతీ నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

Also Read...

జగన్ పనులు చూస్తుంటే చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్టుంది: అనిత

Advertisement

Next Story