ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పేసిన సర్వే: ముఖ్యమంత్రిగా ఎవరంటే?

by Seetharam |   ( Updated:2023-12-12 08:37:12.0  )
ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పేసిన సర్వే: ముఖ్యమంత్రిగా ఎవరంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీ-జనసే పార్టీలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్నాయి అంటే సర్వేలు అనేవి హల్‌చల్ చేస్తుంటాయి. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది... ఏ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుంది అనే అంశాలపై సర్వే సంస్థలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తాయి. ఇవి ఎన్నికలకు ముందు సర్వసాధారణం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు సర్వేసంస్థలన్నీ ఏపీవైపు టర్న్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయనేదానిపై ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్థదాస్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే ఫలితాలలో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

వైసీపీకి 46శాతం ప్రజల మద్దతు

ఇకపోతే ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల ఫలితాల విశ్లేషకులు పార్ధదాస్ ఇటీవలే సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాల్లో శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించారు. ఏపీలో ప్రజల మూడ్ ఏంటనేదానిపై సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీ, శ్రీకాళహస్తి, పెదకూరపాడు, నెల్లూరు సిటీ నియోజకవర్గాలలో శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించారు. ఈ శాంపిల్స్ సేకరించగా పబ్లిక్ పల్స్ ఎలా ఉందో పార్థదాస్ బయట పెట్టారు. పార్ధదాస్ వెల్లడించిన నివేదిక ప్రకారం వైసీపీకి 46 శాతం , టీడీపీకి 40 శాతం, జనసేనకు 11 శాతం మద్దతు ఉన్నట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రిగా జగన్‌కే మద్దతు

ఇకపోతే ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారు అనే అంశంపైనా శాంపిల్స్ సేకరించినట్లు ప్రముఖ సెఫాలజిస్ట్ పార్థదాస్ వెల్లడించారు. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా 46 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు తమ సర్వేలో వెల్లడైందన్నారు. అలాగే చంద్రబాబు సీఎం కావాలని 36 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇకపోతే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను 10 శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటుంటే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను మాత్రం కేవలం 8శాతం మంది మాత్రమే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే అంశంలో చంద్రబాబు కంటే వైఎస్ జగన్‌కు 10 శాతం మంది ప్రజల మద్దతు ఎక్కువగా కనిపిస్తోంది అని ప్రముఖ సెఫాలజిస్ట్ పార్థదాస్ తన సర్వేలో వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed