తునిలో.. తగ్గేదేలే.. పట్టు వీడని వైసీపీ, టీడీపీ

by Anil Sikha |   ( Updated:2025-02-18 05:35:32.0  )
తునిలో.. తగ్గేదేలే.. పట్టు వీడని వైసీపీ, టీడీపీ
X

దిశ డైనమిక్ బ్యూరో : కాకినాడ జిల్లా తునిలో హై టెన్షన్ నెలకొంది. నిన్న జరగాల్సిన తుని పురపాలక సంఘం ఉపాధ్యక్షుడు ఎన్నిక ఈరోజుకు వాయిదా పడింది. వైసీపీ నేతలు ఇవాళ చలో తుని కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కాకినాడలో కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం తుని బయలుదేరగా పోలీసులు ఆయనను అడ్డగించారు. దీంతో ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. అదేవిధంగా తునిలో వంగా గీతను పోలీసులు అడ్డగించారు. కారులో అనుచరులతో వెళుతుండగా పోలీసులు ఆమెను ఆపారు. తుని పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

మరోవైపు మున్సిపల్ చైర్ పర్సన్ ఇంట్లోకి వైసీపీ కౌన్సిలర్లు వెళ్లారు. టీడీపీ శ్రేణులు కూడా చైర్పర్సన్ ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారుజ నిన్న నిర్వహించాల్సిన ఎన్నిక కోరం లేక నేటికి వాయిదా పడింది. తుని మున్సిపల్​కార్యాలయానికి జేసీ రాహుల్​ మీనా చేరుకున్నారు.

Next Story

Most Viewed