- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
YCP : నిరుద్యోగులు రోడ్లెక్కుతుంటే మ్యాచ్ చూస్తారా? లోకేష్ పై వైసీపీ ట్వీట్

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పై వైసీపీ(YCP) మరోసారి విరుచుకు పడింది. లోకేష్ నేడు ఇండియా పాకిస్థాన్ మ్యాచ్India vs Pakistan Match) చూడటానికి దుబాయ్(Dubai) వెళ్ళడంపై వైసీపీ నేతలు మండి పడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే మీరు మాత్రం దుబాయ్ లో మ్యాచ్ చూస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుందని అన్నారు. ప్రజలు బాధల్లో ఉంటే అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. జనం కష్టపడుతుంటే మీరు సంబురాలు చేసుకుంటున్నారు. బాధ్యత లేని బర్రెగొడ్లకు అధికారం కట్టబెడితే ఇలాగే పాలన గాలికి వదిలేస్తారని పరుష పదాలతో దూషించింది వైసీపీ సోషల్ మీడియా. విద్యార్థులు, నిరుద్యోగులకు ఏం సమాధానం చెబుతారంటూ నిలదీసింది. వారిని గాలికి వదిలేసి.. లోకేష్ స్నేహితులతో ట్రిప్ కు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. వెంటనే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.