సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. మెగాస్టార్‌కు YCP ఎంపీ కౌంటర్

by GSrikanth |   ( Updated:2023-08-11 12:43:28.0  )
సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. మెగాస్టార్‌కు YCP ఎంపీ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వాల్తేరు వీరయ్య 20 డేస్ ఫంక్షన్‌లో ప్రభుత్వంపై ప్రభుత్వంపై చిరు చేసిన కామెంట్స్‌కు సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి స్పందించారు. ‘‘సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కొందరు సినిమా హీరోలు చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ.. లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్.’’ అంటూ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Read More..

నాలోనే ఉందనుకున్నా మీలో ఇంత కామం ఉందను కోలేదు..!

Chiranjeevi ‘Bhola Shankar’ మూవీకి ఏపీ సర్కారు బిగ్ షాక్!

Advertisement

Next Story