- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్‌లో తీరుమల వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్న వైసీపీ ఎమ్మెల్సీ
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన టికెట్లకు చాలా డిమాండ్ ఉంటుంది. ఇందులోను వీఐపీ దర్శనం టికెట్లకు మామూలు డిమాండ్ ఉండదు. దీంతో భక్తుల డిమాండ్ ను ఆసరగా చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. తిరుమల వీఐపీ దర్శనం టికెట్లను బ్లాక్ లో అమ్ముకున్నట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం.. తన లేఖతో 6 టికెట్లను ఇతర భక్తులకు ఇప్పించారు. ఇందుకుగాను రూ. 65 వేల రూపాలయ సదరు భక్తుల వద్ద నుంచి ఎమ్మెల్సీ వసూలు చేసినట్లు గుర్తించారు. అధిక ధరకు టీటీడీ వీఐపీ దర్శనం టికెట్లను అమ్ముకున్న ఎమ్మెల్సీపై టీటీడీ అధికారులకు భక్తుడి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. టీటీడీ అధికారులు విచారణలో బ్లాక్ లో టికెట్లు అమ్మినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్వో కృష్ణతేజ పేర్లను పోలీసులు చేర్చారు.