- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:గవర్నర్‌ను కలిసే యోచనలో వైసీపీ ఎమ్మెల్సీ.. కారణం ఇదే?
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేక పోయింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. పలువురు వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీలో చేరుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ గవర్నర్‌ను కలిసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆమె నెలరోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఇప్పటి వరకు ఆమె రాజీనామాకు ఆమోదముద్ర వేయలేదని.. తన రాజీనామాపై మండలి చైర్మన్‌కు రెండు సార్లు లేఖ రాసినా ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లే ఆలోచనలో ఆమె ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశానని మరోసారి ఈ విషయాన్ని గవర్నర్‌కు తెలుపాలని నిర్ణయించుకున్నారంట. తన రాజీనామాను ఆమోదించిన తర్వాత టీడీపీలో చేరతారని.. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమై పార్టీలో చేరికపై చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి.