అధికార పార్టీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే

by Mahesh |   ( Updated:2024-03-19 08:01:57.0  )
అధికార పార్టీకి షాక్.. కాంగ్రెస్ లో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు టికెట్ దక్కక పోవడంతో సొంత పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ.. పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్యేల జాబితాలో నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కు సీటు దక్కలేదు. దీంతో ఆయన ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఉదయం వైఎస్ షర్మిల నివాసానికి వెళ్లిన ఆయన కాంగ్రెస్ లో చేరగా.. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా ఎమ్మెల్యు ఆర్థర్ కు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలికారు. దీంతో ఆయన మరోసారి నందికొట్కూరు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Read More..

నేను శపిస్తే సర్వనాశనం అవుతారంటూ.. మీడియా పై కేఏ పాల్ ఫైర్

Advertisement

Next Story