- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Politics:టీడీపీలో చేరికపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి, నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందింది. అన్ని స్థానాల్లో గెలుపు పై ధీమాతో ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో ఓటమి అనంతరం పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఇప్పటికే మాజీ సీఎం జగన్ పార్టీ నేతలను పరామర్శించారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని, అధికార టీడీపీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది.
దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఖండించారు. వైసీపీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను పార్టీ మారడం లేదని తెల్చీ చేప్పారు. వైఎస్‌ఆర్ ఆశయాల కోసం జగన్ పట్టుదలను చూసి వైసీపీ లో చేరాను. జగన్ నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు. ప్రతిపక్షంలో ఉంటూ పోరాటం చేస్తా కానీ పార్టీ మారను అన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దు అని కోరారు.