కనుమ కానుకగా ఫుల్ బాటిల్, కోడి పంచిన వైసీపీ MLA (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2024-06-29 15:39:11.0  )
కనుమ కానుకగా ఫుల్ బాటిల్, కోడి పంచిన వైసీపీ MLA (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పండగ సందర్భంగా బట్టలు పంపిణీ చేయడం ఇప్పటి వరకు చూశాం. కొత మంది నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం తెలుసు. అయితే ఏపీలో వైజాగ్ సౌత్ వైసీపీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ ఈ సారి పండగకు వెరైటీగా ప్లాన్ చేశారు. ఓ కోడి, ఫుల్ బాటిల్ పంచారు. వాసుపల్లి రామబాణం కాలేజీలో కనుమ పండగ సందర్భంగా కోడి, ఫుల్ బాటిల్ పంచడంతో స్థానికులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పండగ పూట పంచితే తప్పేముంది.. ఎలక్షన్స్ అప్పుడు పంచితే తప్పుకానీ అంటున్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. యువతను తాగుడుకు బానిసలు చేస్తుంది మీలాంటి నాయకులే.. మీ స్వార్థ రాజకీయాల కోసం.. మీ భవిష్యత్తు కోసం వ్యవస్తను చెడగొడుతున్నారు. పండగలు అంటే తాగడం, ఊగడం అనేటట్లు తయారు చేశారు అంటూ మండి పడ్డాడు.

Click Here For Post..

Advertisement

Next Story