- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విచారణకు వెళ్లం... జేసీ నోటీసులపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్: భూ ఆక్రమణల(Land Grabbing) ఆరోపణలపై విచారణకు రావాలని అన్నమయ్య జిల్లా రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి(YCP MLA Akepati Amarnath Reddy) కుటుంబానికి జాయింట్ కలెక్టర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విచారణకు అమర్నాథ్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా హాజరుకాలేదు. అంతేకాదు జాయింట్ కలెక్టర్ జారీ నోటీసులపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి(Uyyalawada Narasimha Reddy) వర్థంతి సందర్భంగా రాజంపేట(Rajampet)లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న అమర్నాథ్ రెడ్డి.. జేసీనే కాదని, ఎవరు నోటీసులు ఇచ్చినా విచారణకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. తన ఎస్టేట్‌లో ప్రభుత్వ భూములుంటే స్వాధీనం చేసుకోవచ్చని తెలిపారు. ఎక్కడైనా ప్రభుత్వం, ప్రైవేటు భూమిని తాము ఆక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవచ్చన్నారు. ఎలాంటి బెదిరింపులకైనా తాము భయపడమని అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు.