- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: వైసీపీ లీగల్ సెల్ వల్లే చంద్రబాబు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రిలో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపారు. అనారోగ్య సమస్యలతో బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబు జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌కు సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ వెనుకున్నఎవరున్నారనే విషయాన్ని సాక్షాత్తు వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ బయటపెట్టారు. వైసీపీ లీగల్ సెల్ వల్లే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని కుండబద్దలు కొట్టారు. ఇప్పటికీ వైసీపీ లీగల్ సెల్ బలంగానే ఉందని తెలిపారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు. వైసీపీ లీగల్ సెల్ నుంచి కేవలం జగన్ మీద ప్రేమతో పని చేశారని తెలిపారు. అన్ని పార్టీలో లీగల్ సెల్‌కు విలువలు, అవసరం ఎక్కువగా ఉంటాయని వెల్లంపల్లి తెలిపారు.
విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ న్యాయవాదులకు సీఎం జగన్ అండగా ఉంటున్నారని చెప్పారు. లా నేస్తం ద్వారా లాయర్లకు ఆర్థిక సాయం చేశారని పేర్కొన్నారు. వచ్చే 20 నుంచి 30 ఏళ్లపాటు సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు. సీఎం జగన్ ఒక ప్రణాళికా బద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నారని పేర్కొన్నారు.