Breaking: మరో సంచలన నిర్ణయం.. వారికి కీలక బాధ్యతలు

by srinivas |   ( Updated:2024-02-10 16:14:18.0  )
CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధిష్టానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైసీపీ రిజినల్ కోఆర్డినేటర్లను ఆయన నియమించిన విషయం తెలిసిందే. అయితే వారికి తాజాగా కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల విజయసాయిరెడ్డికి, కర్నూలు, నంద్యాల పార్లమెంట్ బాధ్యతలు రామసుబ్బారెడ్డికి, కడప, రాజంపేట పార్లమెంట్ బాధ్యతలు సురేష్‌బాబుకు, విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మాల్లాది విష్ణు, ఉమ్మడి విశాఖ డిప్యూటీ రిజనల్ కో ఆర్డినేటర్‌గా అమర్‌నాథ్‌కు బాధ్యతలు అప్పగించారు.

కాగా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ దూకుడు పెంచారు. ఎలాగైనా సరే 175 నియోజవర్గాల్లో గెలవాలనే లక్షంతో పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నేతలపై వ్యతిరేకత ఉన్న నియోజకవర్గం పార్టీ ఇంచార్జులను నియమించారు. ఇందులో భాగంగా పలువురికి వచ్చే ఎన్నికల్లో సీటు నిరాకరించారు. అటు పార్లమెంట్ నియోజకవర్గాలకు సైతం ఇంచార్జులను సీఎం నియమించారు. ఇంకా కొన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను ఇంచార్జులను నియమించేందుకు కసరత్తులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ రిజినల్ కోఆర్డినేర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Next Story