AP News:‘మా అనుమానాలను ఈసీ క్లియర్ చేయాలి’..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-08-27 15:41:30.0  )
AP News:‘మా అనుమానాలను ఈసీ క్లియర్ చేయాలి’..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:గత ఎన్నికల పోలింగ్ శాతంపై తమకు అనుమానాలు ఉన్నాయని, వీటిని ఈసీ నివృత్తి చేయాలని వైసీపీ నేత అంబటి రాంబాబు కోరారు. ఈ క్రమంలో ఏపీలో 68.12 శాతం పోలింగ్‌ అయితే 82 శాతం ఎలా అయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. సీఈవో వివేక్ యాదవ్‌తో వైసీపీ నేత భేటీ అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. ఏ అసెంబ్లీ స్థానంలో, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో ఈసీ ప్రకటించాలి. పోలింగ్ శాతాన్ని 3 సార్లు ప్రకటించడం విడ్డూరం అన్నారు. ఫామ్ 20 ఎందుకు అప్లోడ్ చేయడం లేదు? దీనిపై ఎన్నికల కమిషన్ అశ్రద్ధ వహిస్తోంది. అని ఆయన మండిపడ్డారు. ఎన్నికలు పూర్తి అయ్యాక ఏపీలో 68.12 శాతం పోలింగ్ పూర్తి అయిందని, ఆ తర్వాత 76.5 శాతానికి పెరిగిందని, ఫైనలుగా 80.66శాతంగా ప్రకటించారని గుర్తు చేశారు. కానీ కౌంటింగ్ సమయంలో 82 శాతం పోలింగ్ జరిగినట్లుగా ఈసీ చెప్పిందని ఆయన తెలిపారు. కావున ఎన్నికల సంఘం ఈ అనుమానాలు క్లియర్ చేయాలని అంబటి రాంబాబు కోరారు.

Advertisement

Next Story

Most Viewed