- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గవర్నర్ సార్ వారిపై చర్యలు తీసుకోండి’.. దాడులపై ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ నాయకులపై దాడులు జరిగాయి. అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ తండ్రి విగ్రహాలతో పాటు ఆపార్టీ నేతలు, కార్యకర్తల ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్నారు. దీంతో గవర్నర్ నజీర్‌కు వైసీపీ ఎంపీ వైసీపీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు శనివారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. మూడు వారాలుగా తమ పార్టీ శ్రేణులపై అధికార పార్టీ నేతలు దాడుల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఉన్న శిలాఫలకాలను సైతం ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. వైసీపీ కార్యాలయాలతో పాటు తమ పార్టీ నేతల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని నిబంధనలు, అనుమతులతోనే వైసీపీ కార్యాలయాలకు భూమి కేటాయించామని, అయినా దుష్ప్రచారం చేస్తున్నారని, తమరు వెంటనే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరారు. వైసీపీకి ఓటు ప్రజలపైనా దారుణాలకు పాల్పడుతున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు దారి తప్పాయని కట్టడి చేసేందుకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్ నజీర్‌కు వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.