పవన్‌కు ‘పిచ్చి’.. స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా.?

by Disha Web Desk 16 |
పవన్‌కు ‘పిచ్చి’.. స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా.?
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతల విమర్శల దాడి పెరిగింది. సీఎం జగన్‌పై ఆయన వారాహి విజయభేరి యాత్రలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు ప్రతిగా కౌంటర్లు వేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్‌కు ‘పిచ్చి’ అనే స్ట్రాటజీని ప్రయోగిస్తు్న్నారు. వైసీపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు ఇప్పుడే ఈ పదాన్నే ఆయుధంగా మార్చారు. పవన్ కల్యాణ్ కు పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శలు కురిపిస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు పచ్చి పరాకాష్టకు చేరిందని సోమవారం ఉదయం మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ విమర్శలు చేశారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వంతు వచ్చింది.

పవన్ కల్యాణ్ కు పిచ్చి బాగా ముదిరిందని గ్రంధి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. పవన్ మాట్లాడుతున్న భాష, రెచ్చిపోవడం పిచ్చి లక్షణమని సెటైర్లు వేశారు. పవన్ మానసిక పరిస్థితి బాగోలేదన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదన్నారు. పవన్ ఊసరివెల్లిలా రంగులు మారుస్తున్నారని విమర్శించారు. పవన్ కు రాజకీయ విలువలు తెలియవని, ఆకు రౌడీలా మాట్లాడుతున్నారని గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. అయితే వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై జనసేన నాయకులు మండిపడుతున్నారు.. పవన్ కల్యాణ్ ప్రశ్నలు సమధానం చెప్పలేకే ‘పిచ్చి’ అనే స్ట్రాటజీ ప్రయోగిస్తున్నారని అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైసీపీ నాయకులు అలా మాట్లాడుతున్నారని కొట్టిపారేస్తున్నారు. ‘పిచ్చి’ అనే స్ట్రాటజీ ఓట్లు రాలవని, ఆశలు పెట్టుకోవద్దని జనసేన నేతలు కౌంటర్ ఇస్తున్నారు.



Next Story

Most Viewed