వైసీపీకి లోకల్ టెన్షన్! తెలంగాణలో కేసీఆర్ ఫలితాలు రిపీట్ కాకుండా జగన్ వ్యూహం

by Ramesh N |   ( Updated:2024-02-25 14:30:29.0  )
వైసీపీకి లోకల్ టెన్షన్! తెలంగాణలో కేసీఆర్ ఫలితాలు రిపీట్ కాకుండా జగన్ వ్యూహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయి. తాజాగా టీడీపీ-జనసేన పార్టీలు పొత్తులో భాగంగా 118 స్థానాల అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీకి 94, జనసేనకు 24 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు నాయకుల లిస్ట్ విడుదల చేశారు. దీంతో వైసీపీ పార్టీకి టెన్షన్ మొదలైందని పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ అప్రమత్తం

టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల చేయడంతో వైసీపీ పార్టీ అప్రమత్తమయ్యింది. ఎందుకంటే వైసీపీ పార్టీలో లోకల్ టెన్షన్ మొదలైంది. స్థానిక నేతలు ఓట్లు ఎవరికి వేయిస్తారనే అనుమానం వైసీపీకి మొదలైంది. వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. సంక్షేమ ఫలాలు అందని వారికి స్థానిక వైసీపీ లోకల్ లీడర్లు సమాధానాలు చెప్పలేకపోతున్నారని సమాచారం. దీంతో వారు మరో పార్టీకి జంప్ అవుతారా? లేక వైపీపీలోనే ఉంటు వేరే పార్టీలకు ఓటు వేయిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

స్థానిక నేతలు ఝలక్ ఇస్తారనే ఆందోళన

స్థానిక నేతలు ఝలక్ ఇస్తారనే ఆందోళన వైసీపీ అధిష్టానానికి మొదలైంది. స్థానిక నేతలను గ్రిప్‌లో పెట్టుకోవడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. దీంతో శ్రేణులను వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. సీఎం జగన్‌ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరవుతారు.

బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టిన లోకల్ లీడర్స్!

సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ మీటింగ్‌‌లో పాల్గొంటారని సమాచరం. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్‌తో ఫ్రెండ్లీ పార్టీ అయిన వైసీపీని కూడా అదే తీరులో ఓడిస్తామని ఏపీ ప్రతిపక్ష నేతలు అంటున్నారు. దీంతో వైసీపీ పార్టీ అప్రమత్తమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని లోకల్ లీడర్స్ దెబ్బకొట్టారనే వాదన గతంలో వచ్చింది. దీంతో ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు తమ పార్టీలో కూడా ఇలా రిపీట్ కావొద్దని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే లోకల్ లీడర్స్‌ను తమ వైపు తిప్పుకునేలా వైసీపీ ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే మీటింగ్ ఏర్పాటు చేసి స్థానిక నేతలకు అధినేత జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

Read More..

కేటీఆర్ మాట్లాడుతుండగా పవర్ కట్.. మార్పు బాగుందంటూ సెటైర్లు

Advertisement

Next Story

Most Viewed