- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైసీపీకి భారీ షాక్..టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఆ పార్టీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్నాంటూ కొందరు నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫించన్ దారులకు నగదు పంపిణీలో వార్డు వాలంటీర్లను వినియోగించొద్దని సీఈసీ ఆంక్షలు విధించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దీనికి కారణమని టీడీపీ, జనసేన నాయకులే కారణమంటూ వైసీపీ నేతలు విమర్శలు చేశారు.
అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ అయింది. 100 మంది వాలంటీర్లు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి, నెల్లూరు టీడీపీ అభ్యర్థి గూడూరు నారాయణ సమక్షంలో వీరంతా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు ప్రకటించిన పథకాలు తమకు నచ్చాయని, అందుకే టీడీపీలో చేరామని వాలంటీర్లు తెలిపారు. మరోవైపు నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోనూ వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 40 మంది కార్యకర్తలు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.