జోగి రమేష్‌కి ఊహించని షాకిచ్చిన వైసీపీ.. మార్పు అందుకేనా

by Ramesh Goud |   ( Updated:2024-02-03 10:23:02.0  )
జోగి రమేష్‌కి ఊహించని షాకిచ్చిన వైసీపీ.. మార్పు అందుకేనా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ గత ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఇన్ చార్జిల మార్పులో భాగంగా తన నియోజకవర్గం మారింది. ప్రస్తుతం జోగి రమేష్ ని వైసీపీ అధిష్టానం పెనమలూరు నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించింది. దీంతో కావాలనే పెడన వద్దని పెనమలూరుకు మర్చుకున్నారా.. లేక అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అయ్యిందా..? అనేది ప్రస్తుత రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

టీడీపీకి కంచుకోటగా ఉన్న పెడనలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జోగి రమేష్ ని అభ్యర్ధిగా బరిలోకి దింపగా,42 శాతం ఓట్లతో గెలుపొందారు. పెడనలో కాపు, గౌడ్ సామాజికవర్గం వారు అధిక సంఖ్యలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన స్వతంత్రంగా పోటీ చేయడంతో భారీ సంఖ్యలో కాపు ఓట్లు చీలి జనసేన అభ్యర్ధి అంకెం లక్ష్మీ శ్రీనివాస్ కి పడ్డాయి. ఈ అంశం జోగి రమేష్ కి కలిసొచ్చి 5 శాతం ఓట్ల తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో ఈ సారి గత ఎన్నికల మంత్రం పని చేయదని ముందే ఊహించినట్లు తెలుస్తొంది.

ప్రస్తుతం జోగి రమేష్ సీటు మార్పు వైసీపీ అధిష్టానమే ఫైనల్ చేసిందా.. లేక కావాలని మంత్రి తన నియోజకర్గాన్ని మార్చుకున్నారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. 2014 ఎన్నికల్లో మైలవరం నియోజవర్గం నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్ధి బొండా ఉమ చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా ఇప్పటికీ మైలవరంలో తన హవా కొనసాగుతుంది. గత ఎన్నికల్లో మైలవరం నుంచి గెలిచిన వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్ తో విభేదాల వల్ల పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో మైలవరం టికెట్ తనకు కేటాయించాలని మంత్రి అధిష్టానాన్ని కోరినట్లు తెలిసింది. కానీ పార్టీ మాత్రం ఆయనకు పెనమలూరు సీటు కెటాయించి ఊహించని షాక్ ఇచ్చింది. పెనుమలూరులో కూడా జోగికి ఎదురుగాలి వీస్తుండటంతో, ఎన్నికల సమయానికైనా మైలవరం సీటు దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది.

Read More on Andhra Pradesh Election Updates

Advertisement

Next Story

Most Viewed