- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి: నంద్యాల సభలో సీఎం జగన్ ఫైర్
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు జిత్తులమారి, పొత్తుల మారి అని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. నంద్యాల సిద్ధం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నరకాసురుడు, రావణుడు, దుర్యోదనుడు కలిశారని విమర్శించారు. చంద్రబాబు కూటమిని ఓడించాలని ఆయన పిలుపు నిచ్చారు. చంద్రబాబుకు ఓటు వేయొద్దని.. వేస్తే పదేళ్లు వెనక్కి వెనక్కి పోతామన్నారు. ఓటు వేసే ముందు చంద్రబాబు, జగన్ పాలనపై ఆలోచించాలని సూచించారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలను గతంలో చూశామని, మళ్లీ నారా వారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలన్నారు. వైసీపీకి ఓటు వేస్తే మరో ఐదేళ్లు ముందుకు వెళ్తామని చెప్పారు. గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఇవన్నీ చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. ఒక్కసారి ఈ ఐదేళ్లలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని గమనించాలని సూచించారు. ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని తెలిపారు. లంచాలు, వివక్ష లేని పరిపాలన చేశామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.