ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు.. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-21 07:34:05.0  )
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు.. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో సవరణ బిల్లును ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడంపై రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ తీరును చాలామంది నేతలు పార్టీలకతీతంగా ఖండిస్తున్నారు. ఈ క్రమంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. తన పదవికి ఆయన రాజీనామా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాగా ఇప్పటికే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం జగన్ వంచన చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా జగన్ తీరును తప్పుబట్టారు. ఎన్టీఆర్ చొరవతో ప్రారంభమైన హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరునే కొనసాగించాలని కోరారు. ఎప్పటినుంచో దశాబ్దాలుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఇప్పుడు వైఎస్సార్ పేరు పెట్టడం కరెక్ట్ కాదని వల్లభనేని వంశీ అభిప్రాయపడ్డారు. కాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఎన్టీఆర్ భార్య లక్ష్మిపార్వతి ఇప్పటివరకు స్పందించకపోవడం విశేషం. ఇక ఎన్టీఆర్ వీరాభిమానిగా చెప్పుకునే మాజీ మంత్రి కొడాలి నాని కూడా దీనిపై ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. అటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడంపై ఏపీ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్టీఆర్ పేరుతో ఎప్పటినుంచో ఉన్న యూనివర్సిటీ పేరును ఇప్పుడు మార్చడం సరికాదని వైసీసీ సర్కార్ పై ఫైర్ అయింది.

Also Read: వైఎస్సార్‌కు అసలు ఏం సంబంధం? ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై చంద్రబాబు ఆగ్రహం

Also Read: ఎన్టీఆర్ ను చంద్రబాబు కంటే తాను ఎక్కువ గౌరవిస్తా.. జగన్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed