- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాదవులకు సీటు ఇస్తారా..? హ్యాండ్ ఇస్తారా..? టీడీపీ యోచన ఏంటి
దిశా ప్రతినిధి బాపట్ల: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ గెలుపుపై ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు టీడీపీకి అనుకూలంగా ఉన్న ముస్లిమ్ వర్గాలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా టీడీపీపై యాదవ సామాజిక వర్గం కూడా కన్నెర్ర జేసిందని సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన సామాజిక వర్గం బీసీ అని పదేపదే చెబుతుంటారు. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో.. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో యాదవులకు టికెట్ ను టీడీపీ నిరాకరించింది.
దీనితో బీసీలలో అత్యంత ప్రధాన సామాజిక వర్గమైన యాదవులకు టికెట్ కేటాయించట్లేదు అనేదానిపై తీవ్ర మనస్థాపానికి గురైనట్లు కొంతమంది నేతల నుండి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో గ్రామస్థాయి ద్వితీయ శ్రేణి యాదవ్ శ్రేణులంతా వైసీపీకి తరలి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
అయితే యాదవులకు టికెట్ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం నారా లోకేష్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో చీరాల టికెట్ చేనేత వర్గానికి ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
చీరాలలో చేనేత వర్గానికి టికెట్ ఇస్తే మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం అంతా తనతో కలిసి వస్తారనే ఆలోచనతో ఆయన చీరాలలో చేనేత సామాజిక వర్గానికి సీటు కేటాయించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే నారా లోకేష్ తన స్వార్ధం కోసం యాదవులను పక్కన పెడుతున్నారని యాదవులు టీడీపీపై తీవ్ర ఆగహం వ్యక్తం చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం యాదవులకు టికెట్ ఇస్తేనే బాగుంటుందని మొదటి నుంచి చెప్పుకొస్తున్నట్లుగా సమాచారం. ఇక గురజాల నియోజకవర్గంలో, గుంటూరు పశ్చిమ లోను, చీరాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
Read More..
Big Breaking: లోకేష్ కాన్వాయ్ ను తనిఖీ చేసిన పోలీసులు.. ఏం నిర్ధారించారంటే?