మరోసారి ఛాంపియన్‌గా కోనేరు హంపి: ఏపీ సీఎం ప్రశంసలు

by srinivas |   ( Updated:2024-12-29 07:08:43.0  )
మరోసారి ఛాంపియన్‌గా కోనేరు హంపి: ఏపీ సీఎం ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: న్యూయార్క్‌(New York) వాల్ స్ట్రీట్‌లో ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ (World Rapid Chess) ఛాంపియన్‌షిప్ 2024, బ్లిట్జ్‌ చెస్ ఛాంపియన్‌షిప్‌ మహిళల విభాగంలో భారత ప్లేయర్ కోనేరు హంపి(Indian player Koneru Hampi) విజేతగా నిలిచారు. ఇండోనేషియా(Indonesia)కు చెందిన ఇరిన్ ఖరిష్మా సుకందర్‌ను 11 రౌండ్‌లో ఓడించి మొత్తంగా 8.5 పాయింట్లతో విజయం కైవసం చేసుకున్నారు. చైనా గ్రాండ్‌మాస్టర్ జు వెంజున్ తర్వాత ఎక్కువసార్లు టోర్నీలో గెలిచిన జాబితాలో హంపి రెండో స్థానంలో నిలిచారు. కోనేరు హంపి 1987, మార్చి 31న ఆంధ్రప్రదేశ్ గుడివాడలో జన్మించారు. ఐదు సంవత్సరాల పిన్న వయసులోనే తన తండ్రి కోనేరు అశోక్ ద్వారా హంపికి చదరంగం ఆట పరిచయమైయింది. 1995లో 8 సంవత్సరాలలోపు వారికి నిర్వహించిన జాతీయ చదరంగం పోటీలో హంపి నాలుగవ స్థానం కైవసం చేసుకున్నారు.

ఇక కోనేరు హంపి విజయంతో భారతదేశం గర్విస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అద్భుతమైన విజయం భారత్ చెస్ క్రీడకు అద్భుతమైన సంవత్సరాన్ని అందించిందని చంద్రబాబు తెలిపారు.

Advertisement

Next Story