suicide attempt: పోలీస్ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

by Mahesh |
suicide attempt: పోలీస్ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ వెళ్లిన యువతి ఆత్మహత్యాయత్నం(suicide attempt) చేసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని ఏలూరు(Eluru)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ యువతి తన బావ పై ఫిర్యాదు చేయడానికి బుధవారం మధ్యాహ్నం ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్(Mahila Police Station)కు వెళ్లింది. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కేసు పెట్టొద్దని యువతికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో యువతి.. పోలీస్‌స్టేషన్‌లో కుటుంబసభ్యులతో ఘర్షణ పడింది. కొద్దిసేపు ఇలానే కొనసాగగా.. మనస్థాపం చెందిన యువతి.. పోలీస్ స్టేషన్ బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరేసుకుంది. ఇది గమనించిన లేడీ కానిస్టేబుల్లు వెంటనే డోర్లు బద్దలుకొట్టి.. యువతని బయటకు తీశారు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువతి అపస్మారక స్థితిలో ఉండటంతో హుటాహుటిన.. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా యువతి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story