- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆత్మహత్య చేసుకుంటాం.. ఆరు మండలాల వైసీపీ నేతల హెచ్చరిక
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఇంచార్జుల మార్పులతో ఆ పార్టీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ జాబితాలో పేరు వచ్చిన వాళ్లు సంబురాలు చేసుకుంటున్నారు. ఇంకా పేరు వాళ్లు ఆందోళనకు దిగారు. తమకు కచ్చితంగా సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అధిష్టానం నుంచి వచ్చే సంకేతాలను బట్టి అప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలా కొందరు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు మరో లిస్టు కోసం ఎదురు చూస్తున్నారు. సీటు రాని పక్షంలో పక్క పార్టీలవైపు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో పుత్తూరులో ఆరు మండలాల నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి సీఎం జగన్ మళ్లీ సీటు ఇవ్వాలని తీర్మానం చేశారు. అలా జరగని పక్షంలో పార్టీని కూడా వదులుకునేందుకు తామంతా సిద్దమని నిర్ణయించుకున్నారు. తమ ఆత్మీయ నాయకుడికి సీటు ఇవ్వకపోతే తాము కూడా పార్టీలో ఉండాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నారాయణ స్వామిపై తప్పుడు ప్రచారం చేసి సీటు రాకుండా చేస్తే వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. నారాయణ స్వామికి కచ్చితంగా సీటు ఇవ్వాల్సిందేనని రానిపక్షంలో తాము ఆత్మహత్య చేసుకుంటామని వైసీపీ అధిష్టానాన్ని ఆయన అనుచరులు హెచ్చరించారు.