- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP:అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత పై ఎందుకు సబ్ అధికారుల రహస్యం?
దిశ,రాయదుర్గం:రాయదుర్గం పట్టణ శివారు ప్రాంతంలోని నిత్యం అక్రమంగా మద్యం అమ్మకాలు చేపట్టడం సర్వసాధారణమే..అయితే కర్ణాటక నుండి కొంతమంది ధనార్జనే ధ్యేయంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ బ్యూరో అధికారుల అండదండలతో ఈ దందా సాగుతున్నట్టు సమాచారం. మంగళవారం పట్టణంలోని బీటీపీ రోడ్ నందు అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి సబ్ అధికారులకు పట్టుబడ్డారు. ఎందుకు మీడియాకు సమాచారం ఇవ్వడం లేదో అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తులను అధికారులు పట్టుకుంటున్నారు తప్ప మీడియాకు సమాచారం ఇవ్వడం లేదు.
బీటీపీ రోడ్డు నందు సమీపంలో మరియు పట్టణ సమీపాలల్లో యదేచ్చగా ఓ వ్యక్తి ఐదు మంది వ్యక్తులతో మద్యం అమ్మకాలు చేపడుతున్న అధికారులు చూసీచూడనట్లు వివరిస్తున్నారు. ఒక్క ప్రాంతంలోనే కాకుండా పట్టణ శివారు, స్లమ్ ఏరియాలో అక్రమ కర్ణాటక మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్న అధికారులు చూసి చున్నట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా తమ విధిని నిర్వహించాల్సి ఉంది. నిన్నటి రోజు కూడా ఏదో విషయం జరిగిందని దాచిపెట్టారని ప్రజలు గుసగుసలాడుతున్నారు దీనిపై అధికారులు ఎందుకు మౌనం? పలువురు ప్రశ్నిస్తున్నారు.