మంత్రి రోజాను మహిళగా ఎవరు చూడటం లేదు: కూన రవికుమార్

by Seetharam |
మంత్రి రోజాను మహిళగా ఎవరు చూడటం లేదు: కూన రవికుమార్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజాపై టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోజాను మహిళగా ఎవరూ గుర్తించడం లేదన్నారు. ఆమె మాట్లాడిన తీరు...ఉపయోగించే బాష దారుణాతి దారుణంగా ఉంటుందన్నారు. అందుకే రోజా ప్రవర్తనను చూసి మహిళలంతా సిగ్గుతో తలదించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాల్లో రోజా చేసిన పనులను తాను దగ్గర ఉండి చూసినట్లు చెప్పుకొచ్చారు. బండారు సత్యనారాయణమూర్తి ఆరోపణలను తప్పుబడుతున్న రోజా.. మరి ఆమె మాట్లాడేవి చాగంటి గారి ప్రవచనాలా? అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసునన్నారు. కానీ వారిపై చర్యలు తీసుకునే ధైర్యం పోలీసులకు లేదు అని విమర్శించారు. పౌర హక్కుల విషయంలో పాకిస్థాన్‌కు, ఏపీకి తేడా లేదని కూన అన్నారు. పూర్తిగా టీడీపీపైనే దృష్టి సారించిన పోలీసులు... శాంతిభద్రతలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. పోలీసులు బాధ్యతలను మరిచి వ్యవహరిస్తున్నారంటూ కూన రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed