- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల.. .మాజీ సీఎం జగన్ గుట్టువిప్పిన చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: పోలవరం నిర్మాణంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనతో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కడంతో పాటు నిర్మించుకునే అవకాశం రాష్ట్రానికి దక్కింది. దీంతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో 70 శాతానికి పైగా పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే అనుకున్న మేర పనులు జరగలేదు. ఇందుకు చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలే కారణమంటూ వైసీపీ మంత్రులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టును ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. పోలవరం పనుల్లో ఎక్కడ జాప్యం జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పనుల ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణమని తెలిపారు. ఇప్పుడు తాము మళ్లీ పనులు చేపట్టి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే నాలుగేళ్లు పడుతుందని, అంతేకాకుండా పనుల వ్యయం భారీగా పెరుగుతోందని చెప్పారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన అంబటి రాంబాబు టీడీపీ హయాంలో జరిగిన అవినీతి వల్లే పోలవరం ప్రాజెక్టు పనులు చేయలేకపోయామని కౌంటర్ ఇచ్చారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది.
దీంతో పోలవరంలో అసలు ఎంత వరకూ పనులు జరిగాయనేదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం తీరుతో రాష్ట్రం ఎంత నష్టపోయిందో వివరించారు. రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిపై, ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని తెలిపారు. మొదటిగా పోలవరం ప్రాజెక్టుపై ఓ శ్వేత పత్రం విడుదల చేశారు. ప్రజలు వెబ్ సైట్‌లోనూ చూసుకోవచ్చని తెలిపారు. ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలబడాలనే నినాదంతో తాము ఎన్నికలకు వెళ్లామని తెలిపారు. ప్రజలు గెలిచారని, ఇప్పుడు రాష్ట్రం నిలబడాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి పోలవరం జీవనాడి అని పేర్కొన్నారు. పోలవరం పూర్తిపై నిపుణులు, మేధావుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.