- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ..రేవ్ పార్టీ ఇష్యూ గురించి ఏం చెప్పిందంటే?
దిశ,వెబ్‌డెస్క్:కర్ణాటక రాజధాని బెంగుళూరులో గత నెల 20వ తేదీన జరిగిన రేవ్ పార్టీ కేసు టాలీవుడ్‌తో పాటు ఏపీ పాలిటిక్స్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడం, తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం వంటివి రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అనంతరం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రేవ్ పార్టీ వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా హేమ నేడు (శుక్రవారం) ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. అయితే ఆ వివాదం తర్వాత హేమ మీడియా ముందుకు రాలేదు.
కాగా, నేడు హేమ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి దర్శనం బాగా జరిగింది. నేను ఇక్కడే పుట్టానని మీకు తెలుసు అని చెప్పారు. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా పుట్టిల్లులా ఉంటుంది అని తెలిపారు. ఈ క్రమంలో మీడియా రేవ్ పార్టీ ఇష్యూ గురించి ప్రశ్నించడంతో హేమ సమాధానమిస్తూ..‘ఏమో మీకే తెలియాలి, మీరే వార్తలు రాస్తున్నారు కదా’ అని చెప్పడంతో అందరు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తిరుమల నుంచి బయటకు వెళుతుంటే పలువురు వ్యక్తులు హేమతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు.