Konaseema: వైసీపీలో విషాదం.. కీలక మహిళా నాయకురాలు మృతి

by srinivas |   ( Updated:2023-02-16 15:34:06.0  )
Konaseema: వైసీపీలో విషాదం.. కీలక మహిళా నాయకురాలు  మృతి
X

దిశ: కొత్తపేట: వైసీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు మాజీ ప్రతిపక్ష నాయకురాలు కొల్లి నిర్మలా కుమారి గుండెపోటుతో మృతి చెందారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఆమె రాష్ట్ర వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా పని చేశారు. కపిలేశ్వరపురం జడ్పీటీసీగా గెలుపొందిన అనంతరం జిల్లా పరిషత్ ప్రతి పక్ష నాయకురాలిగా ఎంపిక అయ్యారు. ఆమె భర్త రాజారత్నం ప్రముఖ న్యాయవాది. ఆయన కూడా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.

Also Read...

Kadapa Mlc Elections: మండలి పోరు‌లో పట్టు బిగిస్తున్న Ycp Tdp

Advertisement

Next Story