Chintamaneni: రెడీగా ఈడీ, సీబీఐ.. త్వరలో జైలుకు జగన్

by srinivas |   ( Updated:2023-04-21 16:34:25.0  )
Chintamaneni: రెడీగా ఈడీ, సీబీఐ.. త్వరలో జైలుకు జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత ఎన్నికల్లో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రాజకీయ వ్యభిచారం చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని కుటుంబసభ్యులతో కలిసి సీఎం వైఎస్ జగన్ హత్య చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేకా హత్యను రాజకీయం చేసి నారాసురవారి రక్త చరిత్ర అంటూ తప్పుడురాతలు రాయించి నానా యాగి చేసి గుండెలు బాదుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయ వ్యభిచారం చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చెల్లెలే వైసీపీ ప్రభుత్వంపై నమ్మకం లేదని చెప్పారు.. అందుకే తండ్రి హత్య కేసును తెలంగాణ మార్చాలని కోరిందని, అంతకంటే సిగ్గు ఇంకేముంటుందని విమర్శించారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని, అది తీసేస్తే కూలిపోవడం ఖాయమన్నారు. టీడీపీకి మాత్రం మరణం లేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని జోస్యం చెప్పారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ను లోపల వేసేందుకు ఈడీ, సీబీఐ సిద్ధంగా ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి: Viveka Case: ఊహించని మలుపు.. తెరపైకి రెండో భార్య

Advertisement

Next Story