మక్కీలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెట్టేస్తా: పవన్ కల్యాణ్

by srinivas |
మక్కీలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెట్టేస్తా: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికలకు సిద్ధం అంటున్న జగన్‌కు యుద్ధం ఇద్దామని నాయకులు, కార్యకర్తలకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ జగన్ పాలనలో అందరూ మోసపోయారని తెలిపారు. పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదని వైసీపీ నాయకులకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము మోసే జెండా స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క రోడ్డైనా బాగు పడిందా అని ప్రశ్నించారు. క్లాస్ వార్, కాస్ట్ వార్ అంటున్న జగన్.. ఐదు కోట్ల మంది ప్రజల్ని ఐదుగురు రెడ్ల దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైసీపీ గూండాయిన్ని టీడీపీ, జనసేన కార్యకర్తలు భయపడరని హెచ్చరించారు. ప్రజలపై దాడి చేస్తే సహించేది లేదని, అలా చేస్తే మక్కీలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెట్టేస్తానని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed