- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోడిపందాలు ఆడితే కేసులు పెట్టండి: జిల్లా కలెక్టర్
దిశ ప్రతినిధి, ఏలూరు: కోడిపందాలు నిర్వహించడం నేరమని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో మంగళవారం కోడిపందాల నిషేధంపై రూపొందించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సంక్రాంతికి సమయంలో జిల్లాలో చట్టవిరుద్ధమైన కోడిపందాలను నిరోధించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
ఏపీ గేమింగ్ యాక్ట్, 1974, సెక్షన్ 9(1), సెక్షన్ 9(2) కోడి పందాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు డిస్ట్రిక్ట్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (డీఎస్‌పీసీఏ) చైర్మన్ గా జిల్లా కలెక్టర్ నిషేధం అమలుకు పశుసంవర్ధక శాఖ అధికారులు, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు గ్రామ స్థాయిలో జరుగుతున్న కోడిపందాలు నిర్వహణ పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కోడిపందాలు నిర్వహించకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం, నిర్వహించే వారిపై కేసులు నమోదు చేయడం చేస్తాయన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా.టి.గోవిందరాజు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు డా.హర్ష, డా.జాహ్నవి, ప్రభృతులు పాల్గొన్నారు.