పట్టిసీమలో బందోబస్తు పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజి..

by Jakkula Mamatha |
పట్టిసీమలో బందోబస్తు పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజి..
X

దిశ, పోలవరం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన బందోబస్తు ను ఏలూరు రేంజ్ ఐజి జీవీజీ అశోక్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దైవదర్శనం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఐజి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు రేంజ్ లోని సుప్రసిద్ధ శివక్షేత్రాలలో అశేష భక్త జన సందోహం దేవాలయాలు సందర్శిస్తారన్నారు. ఈ దృష్ట్యా , వాహనాలను ప్రజలకు ఇబ్బందిగా లేకుండా నిర్దేశిత ప్రదేశాలలో వాహనాలను పార్కింగ్ చేయించామన్నారు. అన్ని దేవాలయాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏలూరు రేంజ్ ఐజి తో ఏలూరు జిల్లా ఎస్పీడీ మేరీ ప్రశాంతి, పోలవరం డీఎస్పీ ఎన్.సురేష్ కుమార్ రెడ్డి ,పోలవరం సీఐ ఎం మధు బాబు, ఎస్.బి ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed