- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: పోలవరం జనసేన అభ్యర్థిగా బాలరాజు
దిశ, వెబ్ డెస్క్: జనసేన అభ్యర్థులను ఒక్కొక్కరిగా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పి.గన్నవరం అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను జనసేన అధినేత పవన్ ఖరారు చేశారు. తాజాగా మరో నియోజకవర్గం అభ్యర్థిని కూడా ప్రకటించారు. పోలవరం జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజును ఖరారు చేశారు. ఈ మేరకు బాలరాజు అభ్యర్థిత్వాన్ని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
కాగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల లిస్టును విడుదల చేస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. అయితే పి.గన్నవరం టికెట్ కూడా జనసేన ఖాతాలో పడింది. తొలుత ఈ సీటును టీడీపీ అభ్యర్థి సరిపెల్ల రాజేశ్ (మహాసేన రాజేశ్)కు కేటాయించారు. అయితే మహేశ్ అభ్యర్థిత్వంపై స్థానక నేతలనుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో పి.గన్నవరం సీటును జనసేనకు చంద్రబాబు కేటాయించారు. ఈ మేరకు కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా పని చేసిన సత్యనారాయణ.. రెండు నెలల క్రితం జనసేనలో చేరారు. దీంతో పి.గన్నవరం అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు అవకాశం దక్కింది.
తాజాగా పోలవరం అభ్యర్థిగా చిర్రి బాలరాజును ప్రకటించారు. బాలరాజును కూటమి నాయకులు, కార్యకర్తలు గెలిపించాలని కోరారు.