Weather Report: రాష్ట్రానికి వాతావరణ శాఖ తీపి కబురు.. ఆ ప్రాంతాల్లో విస్తారంగ వర్షాలు

by Shiva |
Weather Report: రాష్ట్రానికి వాతావరణ శాఖ తీపి కబురు.. ఆ ప్రాంతాల్లో విస్తారంగ వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వృద్ధులు, చిన్న పిల్లలు, ఉద్యోగాలకు వెళ్లేవారు నిత్యం భానుడి ప్రతాపానికి విలవిలలాడిపోతున్నారు. ఈ క్రమంలోనే వాతావారణ శాఖ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పింది. ఉత్తర కోస్తా నుంచి అంతర్గత రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి కారణంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు ప్రభావం పూర్తిగా తగ్గింది. దీంతో మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుగులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

Next Story

Most Viewed