- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం.. సీఎం చంద్రబాబు కీలక హామీ

దిశ, వెబ్ డెస్క్: పదేళ్ల బాలుడు (10 Years old Boy) తాను చనిపోతూ మరో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు. అవయవ దానం (donating his organs) చేసి అనారోగ్యంతో ఉన్న ఐదుగురికి ప్రాణం పోశాడు. శ్రీకాకుళం జిల్లా (Srikakulam district) కాపు గోదాయవలస (Kapu Godayavalasa)కు చెందిన యువంత్ (Yuvanth) ఆరో తరగతి చదువుతున్నాడు. జనవరి 29న పుట్టిన రోజు (Birthday) చేసుకున్న తర్వాత రోజు కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రి (Hospital)కి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు (Doctor).. గిలియన్ బ్యారీ సిండ్రోమ్ (Guillain-Barre Syndrome) వ్యాది సోకిందని నిర్ధారణ చేశారు. పిల్లాడికి బ్రెయిన్ డెడ్ (brain dead) కావడంతో.. అవయవదానానికి (donate his organs) తల్లిదండ్రులు (parents) అంగీకరించారు (agreed). బాలుడి రెండు కళ్లు, లివర్, రెండు కిడ్నీలను సేకరించని వైద్యులు.. ఈ అవయవాలను మరి కొందరికి అమర్చారు.
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందిస్తూ.. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. అవయవదానం చేసిన బాలుడి ఫోటోను షేర్ చేశారు. దీనిపై ఆయన.. శ్రీకాకుళం జిల్లా కాపుగోదాయవలసలో ఆరో తరగతి చదువుతున్న పదేళ్ళ యువంత్ అకాలమరణం అత్యంత బాధాకరమని అన్నారు. అలాగే అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పుట్టినరోజే బ్రెయిన్ డెడ్ కు గురైతే.. పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా బాలుడి అవయవదానానికి అంగీకరించిన ఆ తల్లిదండ్రుల మానవతా దృక్పథం, సామాజిక బాధ్యత, మనోనిబ్బరం ఆదర్శనీయమని కీర్తించారు. ఆ కుటుంబానికి సానుభూతి (Expressing sympathy)ని తెలియజేస్తూ.. ప్రభుత్వం (government) వారికి అన్నివిధాలా అండగా ఉంటుందని సీఎం భరోసా (assured) ఇచ్చారు.